NBK 109: ‘అఖండ 2’ అనౌన్స్మెంట్ లోడింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి బాలయ్య లుక్ బయటకి వచ్చింది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య సూపర్ ఉన్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న.. ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జూన్ 10న బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే మరో అప్డేట్ కూడా రెడీ అవుతోంది. బాలయ్య, బోయపాటి.. ఈ డెడ్లీ కాంబినేషన్ గురించి వింటే నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి.
సింహా, లెజెండ్, అఖండ.. ఈ సినిమాలతో బాలయ్యను ఎవరూ చూపించని కోణంలో చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు బోయపాటి. అందుకే మరోసారి ఈ కాంబో మరింత పవర్ ఫుల్‌గా రాబోతోంది. కరోనా టైంలో ఆడియన్స్ థియేటర్స్ లోకి రారేమో అనే భయం ఒక వైపు, టికెట్ రేట్ తగ్గించడంతో పెట్టిన డబ్బులు వస్తాయో రావో అనే భయం ఇంకో వైపు. ఇలాంటి పరిస్థితిలో సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ లోకి వస్తారు అని నిరూపించిన సినిమా అఖండ. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలే కాదు.. తమన్ బీజిఎంతో థియేటర్ బాక్సులు కూడా బద్దలయ్యాయి. ఇప్పటికే బాలయ్య, బోయపాటి ‘అఖండ 2’ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్నారు. ప్రస్తుతం బోయపాటి, రామ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ అయిపోయే లోపు బాలయ్య NBK 108 కూడా అయిపోతే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. అది అఖండ 2నా లేక పాలిటిక్స్ ని టచ్ చేస్తూ వేరే కథతో సినిమా చేస్తారా అనేది జూన్ 10న బాలయ్య బర్త్ డే రోజున వచ్చే అనౌన్స్మెంట్ తో తెలియనుంది.
Also Read
తాజావార్తలు
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!