Site icon NTV Telugu

Nandamuri Balakrishna: బాలయ్య.. మజాకానా.. ప్రభాస్ తో కూడా ఆ పని చేయించేశాడు..

Nbk

Nbk

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ అనుకున్నది.. అనుకున్నట్లు చేయగలడు. బాలయ్య వలన కాదు అన్నవారిచేతే బాలయ్యే కరెక్ట్ అని అనిపించగల సమర్థుడు. ఇక అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజా ఎపిసోడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలయ్యతో సందడి చేశాడు. ప్రభాస్ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలుసు.. మొహమాటస్తుడు.. ఏది మాట్లాడాడు.. ఎవరు ఏమన్నా నవ్వడం తప్ప తిరిగి గట్టిగా కసరడం కూడా ప్రభాస్ కు రాదు అనేది అందరికి తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాక్ షోకు ప్రభాస్ వచ్చింది లేదు. ఇక బాలయ్యతో షో అనగానే.. ప్రభాస్ ఏం మాట్లాడతాడు..? సైలెంట్ గా కూర్చుంటాడు అని అనుకున్నారు.

ఇక బాలయ్య కూడా ప్రభాస్ లో ఉన్న మరో యాంగిల్ ను బయటపెట్టలేడు అనుకున్నారు. కానీ, దెబ్బకు థింకింగ్ ను మార్చేశాడు బాలయ్య. అందుకు సాక్ష్యమే ఈ ఫస్ట్ గ్లింప్స్.. ప్రభాస్ ఎలా మాట్లాడతాడు.. బాలయ్య జోక్స్ కు కౌంటర్లు వేస్తాడా..? అసలు ఏం మాట్లాడకుండా ఉంటాడా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. సెట్ లో ప్రభాస్ చేసిన సందడి చూసేసరికి అభిమానులు దైర్యం వచ్చేసింది.. బాలయ్య, ప్రభాస్ ను మార్చేశాడు.. డార్లింగ్ తో టాస్క్ లు చేయించడంతో పాటు ప్రభాస్ సీక్రెట్ లను కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్, గోపీచంద్ ఒకరి సీక్రెట్ లను మరొకరుచెప్పినట్లు సమాచారం. ఇక ఒక్క ఫస్ట్ గ్లింప్స్ తో ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేశారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Exit mobile version