నందమూరి బాలకృష్ణకు బోయపాటి శ్రీను మరోమారు ‘అఖండ’తో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం కూడా తోడు కావడం మరో హైలెట్. ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలై నెల కావొస్తున్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. ఇక ఇప్పటిదాకా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు త్వరలోనే టీవీల్లో, ఓటిటి ప్లాట్ఫామ్ లో చూడడానికి త్వరలో అవకాశం రాబోతోంది. బాలయ్య ‘అఖండ’ ఓటిటి, టెలివిజన్ ప్రీమియర్ తేదీలు ఫిక్స్ అయ్యాయని సమాచారం. ఈ చిత్రం ఫిబ్రవరి 27న టెలివిజన్ స్క్రీన్‌లలోకి రానుండగా, ఓటిటి ప్రీమియర్‌ను మాత్రం దానికంటే చాలా ముందుగా అంటే జనవరి 12న ప్రసారం చేయనున్నారు.
‘అఖండ’ టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మాలో ప్రదర్శించబడుతుంది, ఇక ఓటిటి ప్రీమియర్ విషయానికొస్తే డిస్నీ + హాట్‌స్టార్ డిజిటల్ ప్రీమియర్ కోసం సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ‘అఖండ’ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ‘అఖండ’లో శ్రీకాంత్ కథానాయకుడిగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సోల్ ఫుల్ సంగీతాన్ని అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.