NTV Telugu Site icon

Nandamuri Balakrishna: ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచం మొత్తం వెతికినా దొరకడు

Bala

Bala

Nandamuri Balakrishna:ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. “వందేళ్ల క్రితం ఓ వెలుగు పుట్టింది. ఆ వెలుగు మరో వేయ్యేళ్లు వెలుగుతుంది. తెలుగు వెలుగు ఎన్టీఆర్. దైవాంశ సంభూతుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తనయునిగా నేను పుట్టడం పూర్వ జన్మ సుకృతం. ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉంది. ఆయన చేసిన సినిమాలు, నటించిన పాత్రలు.. లెక్కలేనివి, చెప్పలేనివి.

Rajinikanth: బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు.. అది ఎవరి వలన కాదు

ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కన్పించరు. ఎన్టీఆర్ నటనకు జీవం పోశారు.
నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఎన్టీఆరే. ఇక ఒక పక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రను చూపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టి పేదవారికి ఎలాంటి సేవ చేశారో అందరికి తెలుసు. రాజకీయాలంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రాజకీయ చైతన్యం కల్పించారు ఎన్టీఆర్. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని.. పాలనను తీసుకెళ్లిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్ని పథకాలను ప్రజలకు అందించారు. అవన్నీ ఇప్పుడు ప్రజలకు వరంగా దొరికాయి” అని చెప్పుకొచ్చారు. ఇక అభిమానుల గురించి, చంద్రబాబు గురించి కూడా బాలయ్య మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments