Site icon NTV Telugu

Balakrishna – Gopichand : బాలయ్య-గోపీచంద్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్

Balayya

Balayya

Balakrishna – Gopichand : ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌ ఏంటనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశమే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్‌ సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా స్టార్ట్ ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది.

Read Also : Prithviraj Sukumaran : పుష్పతో నా సినిమాను పోల్చకండి.. పృథ్వీరాజ్ కామెంట్స్

ఈ క్రమంలోనే మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బాలయ్య చిత్రాల్లో హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ కుర్రప్రేక్షకుల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే. ఈ సినిమాలో జోడీగా నటించబోయే హీరోయిన్ నయనతార పోస్టర్ ను రేపు ఉదయం 10:40 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల ఊహాగానాలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. బాలయ్య, గోపీచంద్ కాంబో అంటే మాస్ ఆడియెన్స్ కు మంచి పండగలాంటి సినిమా పక్కా అనేది తెలిసిందే కదా. ఈ నెలాఖరులో పూజా కార్యక్రమాలతో మూవీని స్టార్ట్ చేయబోతున్నారు.

Read Also : Tortoise : రాజ్ తరుణ్ “టార్టాయిస్” ప్రారంభం

Exit mobile version