‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?

‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమాతో యష్ కు భారీ క్రేజ్ మాత్రమే కాకుండా కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Read Also : రష్మిక మందన్న కాదు మడోనా… ‘పుష్ప’రాజ్ పేరు మార్చేశాడే !!

1986 జనవరి 8న కర్ణాటకలో జన్మించిన యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో డ్రైవర్‌, తల్లి పుష్ప గృహిణి. మైసూరులో చదువు పూర్తి చేసిన యష్ నటనపై మనసు పారేసుకున్నాడు. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి ముందుగా బుల్లితెర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ సీరియల్ ‘నంద గోకుల’తో యష్ తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత కూడా యష్ మరెన్నో టీవీ సీరియల్స్‌లో నటించాడు. 2008లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు యష్. ఇక తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన యష్ “కేజీఎఫ్”తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles