ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు.. ఆ బీజీఎమ్ కి థియేటర్లలో బాక్సులు బద్దలైపోతున్నాయి. బాలయ్య బాబు మాస్ యాక్షన్ కి థమన్ మాస్ బీజీఎమ్ తోడై అఖండ ను అఖండమైన విజయాన్ని అందుకునేలా చేశాయి. దీంతో బాలయ్య అభిమానులు థమన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.
అఖండ బీజీఎమ్ విన్నాకా థమన్ అన్నకు గుడికట్టినా తప్పులేదురా.. అని మీమ్స్ రూపంలో ఆకాశానికెత్తేస్తున్నారు. ఇది బాలయ్య బాబు అఖండ కాదు.. థమన్ అఖండ అని మరికొందరు.. అసలు థమన్ అన్న లేకపోతే సినిమా ఉండేది కాదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మరోపక్క భీమ్లా నాయక్ కి కూడా థమనే సంగీతం వహిస్తున్నాడు .. ఆ పాటలు కూడా అభిమానులను ఊపేస్తున్నాయి. ఇక ఆ సినిమా కూడా హిట్ అయితే నిజంగానే అభిమానాలు థమన్ కి గుడి కట్టేస్తారు అనడంలో సందేహం లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు..
