Balakrishna: పవన్ సినిమాల్లో కంటే రోడ్ల మీద ఎక్కువ కనపడుతున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Comments on Pawan Kalyan goes Viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ విజయోత్సవ సభను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా సాగిన లోకేష్ పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ మేర నడిచారు. ఇక విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో యువగళం నవశకం పేరుతో పాదయాత్ర ముగింపు కోసం బహిరంగ సభను టీడీపీ భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సహా అనేక మంది తెలుగు దేశం నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రసంశలు కురిపించారు. ఈ మధ్య పవన్ సినిమాల్లో కంటే రోడ్ల మీద, సభలలోనే ఎక్కువ కనపడుతున్నాడని అన్నారు.
Pallavi Prashanth Arrested: బిగ్ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్ అరెస్ట్
Also Read
నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని .పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో కంటే ప్రజల్లోనే ఎక్కువగా చూస్తున్నామని ఆయన కొనియాడారు. జనసేనాని ప్రజల కోసం పోరాడటం చాలా సంతోషంగా ఉందని బాలయ్య అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్న ఆయన ఇది యువగళం ముగింపు సభ కాదని నవతరం రాజకీయాలకు ఆరంభమని అని అన్నారు. తన అల్లుడు నారా లోకేష్ మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నందమూరి బాలకృష్ణ సభకు హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక గంజాయి సాగులో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన ఈ రాష్ట్రాన్ని సైకో పరిపాలన చేస్తున్నాడని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని పేర్కొన్న బాలయ్య ఈ సారి జగన్ ప్రభుత్వంను గద్దె దింపాల్సిందేనన్నారు. 10 లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి సున్నా .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ? ‘ అని ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!