Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబాల మధ్య ఉన్న బంధాలను అనుబంధాలను కళ్ళకు కట్టినట్లు చూపించి వేణు ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా బలగం క్లైమాక్స్ లో పాడిన పాట అందరి గుండెలను పిండేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక తండ్రి ఆత్మ.. బిడ్డలు కలిసి ఉండాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ సాంగ్ లో చూపించారు. ఇక ఈ పాట పాడిన దంపతులు మొగిలియ్య, కొమురమ్మ లకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత నుంచి మొగిలయ్య పేరు బలగం మొగిలియ్యగా మారిపోయింది.
Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
Also Read
ఇక ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకున్న మొగిలయ్య తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, తన భర్తను ప్రభుత్వమే ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపింది. ” నా బర్త్ మొగిలయ్యకు అంతకు ముందు కిడ్నీ సమస్య ఉంది. ఇప్పుడు గుండె సమస్య వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దయచేసి.. నా భర్తను కాపాడండి. ప్రభుత్వానికి, పెద్దలకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ డాక్టర్లు ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. నా భర్త కోలుకోవడానికి సహాయం చేయండి” అంటూ కంటనీరు పెడుతూ వీడియోలో మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న కళాకారులకు ప్రభుత్వం సాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు.
బలగం సినిమాలో క్లైమాక్స్ పాట పాడిన బుడగజంగాల కళాకారుడు పస్తం మోగిలయ్య కు తీవ్ర అస్వస్థత. రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు. హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు. ప్రభుత్వమే ఆదుకోవాలని భార్య కొమురమ్మ అభ్యర్థన.@KTRBRS#Balagam #DilRaju #Telangana #KTR #NTVTelugu pic.twitter.com/EI8Hvl3iGL
— NTV Telugu (@NtvTeluguLive) April 11, 2023
తాజావార్తలు
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!