Bigg boss 6: కెప్టెనే… స్టార్ ఆఫ్ ది వీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baladitya Becomes Star Of The Week In Bigg Boss House: బిగ్ బాస్ సీజన్ 6 లో ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్టార్ ఆఫ్ ది వీక్ గా కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎంపిక చేసి, వాళ్ళకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నారు. ఇలా తొలి వారం హౌస్ లోని వ్యక్తులకు సంబంధించిన ప్రశ్నలను సంధించి, అందులో ఎక్కువ సరైన జవాబులు చెప్పిన వారిని స్టార్ ఆఫ్ ది వీక్ గా నాగార్జున ప్రకటించారు. విశేషం ఏమంటే… ఈవారం కెప్టెన్ గా ఉన్న బాలాదిత్య హౌస్ మేట్స్ లోని వారికి సంబంధించిన వివరాలను కరెక్ట్ గా చెప్పడంతో అతనే స్టార్ ఆఫ్ ది వీక్ గా ఎంపికయ్యి, గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. అలానే హౌస్ లో ఉన్న ఒక్కో అమ్మాయిని సింగిల్ వర్డ్ తో వర్ణించమని బాలాదిత్యను నాగార్జున కోరినప్పుడు చాలా తెలివిగా అతను చెప్పిన వర్డ్స్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ వారం నామినేషన్ లో ఉన్న ఏడు మందిలో శనివారం శ్రీసత్య, చలాకీ చంటి సేఫ్ కాగా… ఈ రోజు ఫైమా, రేవంత్ ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలిమినేషన్స్ లో ఉన్న అభినయశ్రీ, ఇనయా, ఆరోహి గురించి తమ అభిప్రాయం చెప్పమన్నారు నాగార్జున. ఏకంగా పద్నాలుగు మంది ఇనయా ప్రవర్తనను తప్పు పట్టారు. దాంతో ఇనయా తనను తాను కంట్రోల్ చేసుకోలేక కన్నీరు మున్నీరైంది. ఆ తర్వాత ఆరోహి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. చివరకు మిగిలిన అభినయశ్రీ, ఇనయానా గార్డెన్ ఏరియాకు పంపి, అక్కడ ఉన్న హేమర్ ఎవరు ఎత్తగలిగితే వారు సేఫ్ అని నాగార్జున చెప్పారు. విశేషం ఏమంటే… ఇద్దరూ తమ ముందున్న హేమర్ ను ఎత్తగలిగారు. దాంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు కాబట్టి… ఎవరినీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేయడం లేదని, ఇక మీదట ప్రతి రోజూ కంటెస్టెంట్స్ కు ఓ పరీక్షేనని నాగార్జున తెలిపారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
దాంతో ఇనయా, అభినయశ్రీ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. పద్నాలుగు మంది విమర్శలకు గురి అయిన ఇనయా వచ్చే వారం వారితో, ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. మొదటి వారం నాగార్జున అభినయశ్రీ పెర్ఫార్మెన్స్ ను మెచ్చలేదు సరికదా థంబ్ ను డౌన్ చేశాడు. ఇకపై తన ఆట తీరును మార్చుకుంటానని, అందరితో మింగిల్ కావడానికి ప్రయత్నిస్తానని అభినయశ్రీ హామీ ఇచ్చింది. చలాకీ చంటి, రాజశేఖర్ విషయంలోనూ నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో… వీరంతా తమ ఉనికిని చాటుకోవడానికి వచ్చే వారం నుండీ తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంది. కాబట్టి అసలు బిగ్ బాస్ హౌస్ లో అసలు ఆట సెకండ్ వీక్ మొదలు కానుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు