Baby Crosses Anand Deverakonda Previous Films Closing Gross in one day: రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవరకొండ. నిజానికి అన్నలా ఉండడం, ఆయనలానే మాట్లాడడం ఆయనకు చాలా మైనస్. కొంత వరకూ ఆ మరకలు తుడుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. అయితే ఇప్పటి దాకా ఆనంద్ దేవరకొండ మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ మూడు సినిమాల్లో ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అవగా మరో రెండు సినిమాలు మాత్రం థియేటర్లలో రిలీజయ్యాయి. ఇక ఆనంద్ హీరోగా పరిచయం అయిన దొరసాని సినిమా బాగుందనే టాక్ వచ్చినా కలెక్షన్స్ మత్రం పెద్దగా రాలేదు. ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ కేవలం రెండు కోట్ల 20 లక్షలు మాత్రమే సంపాదించింది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజ్ చేశారు. ఇక ఆ తరువాత పుష్పక విమానం అనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది దీంతో పూర్తి రన్ లో ఆ సినిమా మూడు కోట్ల 20 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది.
Vijay Deverakonda: ఆ విషయంలో చిరు, పవన్‌లను వెనక్కి నెట్టి నెంబర్1గా దేవరకొండ!
ఇక ఇప్పుడు తాజాగా బేబీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయి రాజేష్ డైరెక్టర్ గా వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను మారుతి, ఎస్కేఎన్ నిర్మాతలుగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తున్నా అందరూ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజే ఆరు కోట్ల అరవై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అంటే ఆనంద్ దేవరకొండ మొదటి రెండు థియేట్రికల్ రిలీజ్ సినిమాల ఓవరాల్ కలెక్షన్స్ కంటే ఈ సినిమా మొదటి రోజు వసూళ్ళు ఎక్కువన్న మాట. ఇక ఈ విషయం తెలిసిన దేవరకొండ అభిమానులు మా ఆనంద్ దేవరకొండ నక్క తోక తొక్కాడురా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు.