Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలే ఎవర్ గ్రీన్ మూవీ. తెలుగు సినిమా గతిని మార్చిన సినిమా. అందులోనూ రెండు పార్టులు కలిపి తీసుకొస్తున్నారు. కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారనే ప్రచారంతోనే ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దెబ్బకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కోట్లు కొల్లగొడుతోంది ఈ మూవీ. ఇలాంటి భారీ సినిమా ముందు మాస్ జాతర గట్టిగానే పోరాడుతోంది.
Read Also : Deepika Padukone : దీపిక పదుకొణెకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్..?
రవితేజకు రీసెంట్ గా అన్నీ ప్లాపులే ఉన్నాయి. కాబట్టి మాస్ జాతరకు పెద్దగా హైప్ రావట్లేదు. బాహుబలి ది ఎపిక్ మూవీకి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా కావాల్సినంత హైప్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి రీ రిలీజ్ సినిమా ముందు డైరెక్ట్ సినిమా తక్కువ వసూళ్లు రాబడితే మాత్రం పరువు పోవడం ఖాయం. అందుకే ఈ సినిమాతో రవితేజ మంచి హిట్ కొట్టాల్సిందే. అసలే రవితేజ సినిమాలకు నార్మల్ ఆడియెన్స్ హిట్ అయితే తప్ప వెళ్లట్లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియెన్స్ వస్తేనే మాస్ జాతర కలెక్షన్లు పెరుగుతాయి. మాస్ జాతర టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా వీకెండ్ మొత్తం బాహుబలిదే అప్పర్ హ్యాండ్ అవుతుంది.
Read Also : Prabhas: ప్రభాస్ అంటే సీక్వెల్ పక్కా.. కానీ అయ్యే పనేనా?
