Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Avatar 2 Run Time Is Above 3 Hours And Show Timings Are Changed

Avatar-2: అవతార్-2 రన్‌టైమ్.. షో టైమింగ్‌లన్నీ మారిపోతున్నాయిగా..!!

Published Date :December 11, 2022 , 4:07 pm
By Ramesh Nalam
Avatar-2: అవతార్-2 రన్‌టైమ్.. షో టైమింగ్‌లన్నీ మారిపోతున్నాయిగా..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Avatar-2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్‌కు సీక్వెల్‌గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్‌టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్‌లు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇంత నిడివి గల సినిమా రాలేదు. చివరకు ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంచుమించు మూడు గంటలు మాత్రమే ఉంది. దీంతో అన్ని థియేటర్లు షో టైమ్‌లన్నీ మార్చేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సాధారణంగా మార్నింగ్ షో 11 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అవతార్-2 నిడివి దృష్ట్యా ఉదయం 9:30 గంటలకే మార్నింగ్ షోను ప్రారంభిస్తున్నారు. మ్యాట్నీ షో 1:30 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 5:30 గంటలకు, సెకండ్ షో రాత్రి 9:30 గంటలకు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాయి.

Read Also: Pawan Kalyan: ఉస్తాద్ గా పవన్ గ్రాండ్ ఎంట్రీ.. భయమేస్తోంది అంటున్న ఫ్యాన్స్

మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు చాలా ప్రాంతాల్లో 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు లేకపోయినా ఈ సినిమాకు బుకింగ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనికి కారణం అవతార్ ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం అనే చెప్పాలి. తొలిరోజు ప్రదర్శనలకు సంబంధించి ఇప్పటిదాకా 2 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, ఆలిండియా వ్యాప్తంగా రూ.7 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కేజీఎఫ్-2, బాహుబలి-2 చిత్రాలు ఈస్థాయి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు అవతార్-2 చిత్రం కూడా వాటి సరసన చేరడం విశేషం.

అటు వీకెండ్ టికెట్ల అమ్మకాల్లోనూ అవతార్-2 అదిరిపోయే అడ్వాన్స్ వసూళ్లు సొంతం చేసుకుంది. శని, ఆది వారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టికెట్లు అమ్ముడైంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు సమాచారం అందుతోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల రూపంలోనే అవతార్-2 సినిమా దాదాపు రూ.80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avatar 2
  • Avatar: The Way of Water
  • hyderabad
  • movie news
  • run time

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions