ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన విజువల్ వండర్ ‘అవతార్ 2’, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారి అంచనాలు ఉండడంతో ఈ మూవీ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి, ఓపెనింగ్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ‘అవతార్ 2’ సినిమాపై మిక్స్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. ఓవరాల్ గా ఇప్పటివరకూ అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 మిలియన్ డాలర్స్ (ఇండియన్ కరెన్సీలో దాదాపు 7000 కోట్లు). 350-400 మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి తీసిన సినిమా 900 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యిందంటే ‘అవతార్ 2’ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యినట్లే. బయ్యర్స్ అందరినీ సేఫ్ జోన్ లోకి తెచ్చేసిన ఈ మూవీ 7000 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ట్రేడ్ వర్గాలు సాటిస్ఫై అవ్వట్లేదు.
Read Also: Allu Aravind Dances: అరవింద్ ‘మామయ్య’ అంటున్న అనుపమ ఫ్యాన్స్!?
‘అవతార్ 2’ సినిమాపై ఉన్న అంచనాలకి, ఆ మూవీని తెరకెక్కించడానికి జేమ్స్ కెమరూన్ వెచ్చించిన సమయానికి, పెట్టిన బడ్జట్ కి 900 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సరిపోవు ఇంకా ఎక్కువ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఓవరాల్ థియేట్రికల్ రన్ లో అవతార్ 2 సినిమా పది వేల కోట్ల వరకూ రాబడుతుంది, 1.5 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే మాత్రం నెగటివ్ ట్రెండ్ ని దాటుకోని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లే అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ ని బట్టి చూస్తే, అవతార్ 2 సినిమా ఇకపై లాంగ్ వీకెండ్స్, హెవీ ఫుట్ ఫాల్స్ రాబడితేనే ‘అవతార్ 2’ సినిమా మార్క్ రీచ్ అవుతుంది.
Read Also: Avatar 2: రెండో రోజు తగ్గిన కలెక్షన్స్… అది దర్శకుడి తప్పేనా?