Atlee Quoting Record Remuneration for Allu Arjun’s Film: తమిళంలో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ మొదటి సినిమా హిట్ కావడంతో రెండవ సినిమాకి విజయ్ లాంటి హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అలా తెరి సినిమా చేసి హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత కూడా మెర్సల్, బిగిల్ లాంటి సినిమాలు చేసి మాంచి హిట్లు అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేసి పాన్ ఇండియా లెవెల్ లో ఒక హిట్ అందుకున్నాడు. నిజానికి అట్లీ వరుస విజయాలు అతన్ని కోలీవుడ్‌లో అతిపెద్ద దర్శకుల్లో ఒకరిగా నిలిపాయి. ఈ కూర్మంలో అల్లు అర్జున్, పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పని చేయవలసి ఉన్నా జవాన్ విజయం తర్వాత అట్లీతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే వీరి ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయి. పుష్ప 2 షూటింగ్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ ఈ సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు.
Suryakiran : బిగ్ బ్రేకింగ్…డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత..
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమా కోసం అట్లీ డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రం కోసం, అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అలాగే సినిమా లాభాలలో కొంత వాటాను డిమాండ్ చేసినట్లు సమాచారం. అట్లీకి అన్ని పరిశ్రమలలో మంచి మార్కెట్ ఉంది, అతని సినిమాల బిజినెస్ ట్రాక్ రికార్డ్‌తో సరిచూస్తే ఆయన డిమాండ్ న్యాయబద్దమైనదే అని అంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు 120 కోట్ల రేంజ్‌లో భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి అంతటి స్టార్ తో నేషనల్ వైడ్ మార్కెట్ ఉన్న తాను సినిమా చేయడానికి 60+ లాభాల్లో వాటా అడగడం పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ లెక్కన చూస్తే ఈ సినిమాకి నటీనటులు- స్టార్ టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ మాత్రమే దాదాపు 250 కోట్ల పారితోషికం అందజేసే అవకాశం ఉంది.