Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అషూ రెడ్డి చుట్టూ అల్లుకున్న వివాదానికి సంబంధించి తాజాగా హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక ఎన్ఆర్ఐ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా అషూ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో వినిపించిన వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. నిందితుడు ఆరోపిస్తున్న భారీ మొత్తం. అయితే, సదరు ఎన్ఆర్ఐ తనంతట తానుగా, ఎటువంటి బలవంతం లేకుండానే దాదాపు ₹9.35 కోట్లు ఖర్చు చేశారని అషూ రెడ్డి కోర్టుకు తెలిపారు. తనను, తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలో, ప్రసన్నం చేసుకోవడానికే ఆయన స్వచ్ఛందంగా ఈ మొత్తాన్ని వెచ్చించారని ఆమె పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య ఎటువంటి లిఖితపూర్వక అగ్రిమెంట్ లేనప్పుడు, కేవలం ఆర్థిక లావాదేవీలు జరిగినంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని ఆమె వాదించారు. ఫిర్యాదుదారుడు తన వ్యక్తిగత నిర్ణయంతో చేసిన ఖర్చులకు అషూ రెడ్డి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ బాధ్యులు కారని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఖర్చుకు తమకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. సీసీఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఎటువంటి వాస్తవాలు లేవని, అందుకే ఆ కేసును కొట్టివేయాలని ఆమె అభ్యర్థించారు. ఈ వాదనలను విన్న హైకోర్టు, కేసు లోటు పాట్లను పరిశీలించేందుకు సిద్ధమైంది. అషూ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై పూర్తి వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ కౌన్సిల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని కోరింది. ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ప్రభుత్వం సమర్పించే వివరాలను బట్టి అషూ రెడ్డిపై ఉన్న ఎఫ్ఐఆర్ కొనసాగుతుందా లేదా కొట్టివేయబడుతుందా అనేది తేలనుంది.
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్‌తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..