డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్న విష్వక్ సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఫలక్‌నుమాదాస్’ నుంచి ‘పాగల్’ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విష్వక్ సేన్. అతను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఎదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ చింత దర్శకుడు. శనివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో విష్వక్ సేన్ ఇది వరకు చేసిన చిత్రాలకు భిన్నమైన లుక్, పాత్రలో కనిపిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో విష్వక్ లుక్‌తో పాటు తను ఏం పని చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు అని తెలిసేలా వివరాలను కార్డులో పొందుపరిచారు. ఇక మోషన్ పోస్టర్ లో అయితే… పెళ్ళికాని ప్రసాద్ గా ‘మల్లీశ్వరి’లో వెంకటేశ్ పడిన బాధలన్నీ ఇందులో కనిపించేలా చూపించారు. జై క్రిష్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పవి కె. పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
Also Read
తాజావార్తలు
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
-
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
-
Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!