టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ ధిలోన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జునకల్యాణం’. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 4 న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక ఈ విషయాన్ని విశ్వక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ” పండగ సినిమా మార్చి 4 న రిలీజ్ అవుతుంది.. అమ్మతోడు ఫ్యామిలీస్ తో కలిసిపోతా ..” అంటూ చెప్పుకొచ్చాడు. 30 ఏళ్ల మిడిల్ క్లాస్ అబ్బాయి పెళ్లి కోసం ఎలా ఆరాటపడ్డాడు.. చివరకు తనకు నచ్చిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. పాగల్ సినిమాతో కొద్దిగా నిరాశపరిచిన విశ్వక్ ఈ సినిమాతో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.