Site icon NTV Telugu

Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..

Untitled 2

Untitled 2

Mission Teaser: కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్.. ఇప్పుడిప్పుడే తెలుగువారికి కూడా చేరువ అవుతున్నాడు. సాహో చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యిన అరుణ్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ‘ఫియర్‌లెస్ జ‌ర్నీ’ ట్యాగ్ లైన్. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ సరసన ‘ఐ’ బ్యూటీ అమీ జాక్సన్ నటిస్తోంది. ఇప్పటికేఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Rajashekar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..

లండ‌న్‌లో పేరు మోసిన జైలు వాండ్స్ వ‌ర్త్. ఈ సినిమా మొత్తం ఈ జైలు బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలోని ఖైదీలంద‌రూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో అమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్ర‌లో హీరో అరుణ్ విజ‌య్ న‌టించారు. కుటుంబంతో ఇండియా నుంచి లండ‌న్ వ‌చ్చిన అరుణ్ విజ‌య్‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారు. త‌న కుమార్తెకు మ‌రో రెండు రోజుల్లో ఆప‌రేష‌న్ ఉంటుంది. త‌నేమో జైలులో ఉంటాడు. త‌న కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అస‌లేం జరిగింది..హీరో అరుణ్ విజ‌య్ ఏ కార‌ణాల‌తో తను వాండ్స్‌వ‌ర్త్ జైలుకి వెళ్లాడు. చివ‌ర‌కు వాండ్స్ వ‌ర్త్ జైలు సూప‌రిడెంట్ ఆఫీస‌ర్ అయిన అమీ జాక్స‌న్ ఏమైనా హెల్ప్ చేసిందా?.. అసలు ఏ ‘మిషన్’ కోసంహీరో జైలుకు వెళ్లాడు అనే వివ‌రాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అద్బుత‌మైన స‌న్నివేశాలు, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. జి.వి.ప్ర‌కాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలుస్తుంద‌న‌టంలో డౌటేలేద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. టీజర్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version