Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artist Pratik Sanghar Copy Allegations On Adipurush Poster: ఏ ముహూర్తాన ఆదిపురుష్ సినిమాను ప్రారంభించారో తెలీదు కానీ.. ఆది నుంచి ఇది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదట టీజర్ విడుదల అయినప్పుడు.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో పాటు హిందూ సంఘాలూ దుమ్మెత్తిపోశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ టీజర్‌లో పాత్రల్ని చూపించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు.. చాలా రోజుల పాటు ఈ వివాదం నడిచింది. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌పై కూడా సినీ ప్రియులు పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు. పోస్టర్ డిజైన్ దారుణంగా ఉందని, ఏమాత్రం ఆకట్టుకోలేదని తిట్టారు. ఇవి చాలవన్నట్టు.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ‘కాపీ’ వివాదంలో చిక్కుకుంది.
China: యుద్ధానికి మేం సిద్ధం.. తైవాన్‌కు చైనా సవాల్
Also Read
ఆదిపురుష్ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ రాముని లుక్, తన ఆర్ట్ వర్క్‌ను చూసి కాపీ కొట్టారని ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించాడు. ప్రభాస్ లుక్, తన ఆర్ట్ వర్క్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆదిపురుష్ మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా తన ఆర్ట్‌ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించాడు. ‘‘నేను భారత్‌కు చెందిన ఆర్టిస్ట్‌ని. రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం నేను నా అన్వేషణను ప్రారంభించా. ఏడాది క్రితమే అది జరిగింది. అయితే.. ఆదిపురుష్‌లో పనిచేస్తున్న ఆర్టిస్ట్, నా కళను కాపీ కొట్టారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నా ఆర్ట్‌ని కాపీ కొట్టి, రాముడి రూపాన్ని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ వైఫల్యానికి ఇదొక కారణం. ప్రాజెక్ట్‌పై పని చేసే వ్యక్తులకు అభిరుచి, ప్రేమ లేకపోవడం వల్లే ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్లే చేస్తున్నారు. అయితే.. వాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోరని నాకు తెలుసు’’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.
Shefali Shah: నన్ను అనుచితంగా తాకారు.. నేనేం చేయలేకపోయా
కాగా.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల చిత్రీకరణపై మేకర్స్‌ను తప్పుబట్టారు. ఇటీవల రిలీజైన పోస్టర్‌లో సైతం రామునికి పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం ‘జానీవు'(జంజం) లేకుండా చూపించారని మేకర్స్‌పై ఫిర్యాదు కూడా నమోదైంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!