NTV Telugu Site icon

Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..

Pratik Sanghar Adipurush

Pratik Sanghar Adipurush

Artist Pratik Sanghar Copy Allegations On Adipurush Poster: ఏ ముహూర్తాన ఆదిపురుష్ సినిమాను ప్రారంభించారో తెలీదు కానీ.. ఆది నుంచి ఇది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదట టీజర్ విడుదల అయినప్పుడు.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో పాటు హిందూ సంఘాలూ దుమ్మెత్తిపోశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ టీజర్‌లో పాత్రల్ని చూపించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు.. చాలా రోజుల పాటు ఈ వివాదం నడిచింది. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌పై కూడా సినీ ప్రియులు పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు. పోస్టర్ డిజైన్ దారుణంగా ఉందని, ఏమాత్రం ఆకట్టుకోలేదని తిట్టారు. ఇవి చాలవన్నట్టు.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ‘కాపీ’ వివాదంలో చిక్కుకుంది.

China: యుద్ధానికి మేం సిద్ధం.. తైవాన్‌కు చైనా సవాల్

ఆదిపురుష్ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్ రాముని లుక్, తన ఆర్ట్ వర్క్‌ను చూసి కాపీ కొట్టారని ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించాడు. ప్రభాస్ లుక్, తన ఆర్ట్ వర్క్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆదిపురుష్ మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా తన ఆర్ట్‌ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించాడు. ‘‘నేను భారత్‌కు చెందిన ఆర్టిస్ట్‌ని. రామాయణ ఇతిహాసంలోని శ్రీరాముడి రూపం కోసం నేను నా అన్వేషణను ప్రారంభించా. ఏడాది క్రితమే అది జరిగింది. అయితే.. ఆదిపురుష్‌లో పనిచేస్తున్న ఆర్టిస్ట్, నా కళను కాపీ కొట్టారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నా ఆర్ట్‌ని కాపీ కొట్టి, రాముడి రూపాన్ని ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ వైఫల్యానికి ఇదొక కారణం. ప్రాజెక్ట్‌పై పని చేసే వ్యక్తులకు అభిరుచి, ప్రేమ లేకపోవడం వల్లే ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్లే చేస్తున్నారు. అయితే.. వాళ్లు దీన్ని పెద్దగా పట్టించుకోరని నాకు తెలుసు’’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.

Shefali Shah: నన్ను అనుచితంగా తాకారు.. నేనేం చేయలేకపోయా

కాగా.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల చిత్రీకరణపై మేకర్స్‌ను తప్పుబట్టారు. ఇటీవల రిలీజైన పోస్టర్‌లో సైతం రామునికి పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం ‘జానీవు'(జంజం) లేకుండా చూపించారని మేకర్స్‌పై ఫిర్యాదు కూడా నమోదైంది.