Paramapada Sopanam: ఎంతో మంది ఈ సినిమాని వెనక్కి లాగాలని ప్రయత్నించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read:BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఈ ఈవెంట్‌లో హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. ప్రసన్న, శివ, వీర శంకర్ గారి వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఏప్రిల్ 24న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ .. ‘‘పరమపద సోపానం’ కోసం ప్రాణం పెట్టి పని చేశాం. ఎంతో మంది ఈ సినిమాని వెనక్కి లాగాలని ప్రయత్నించారు. కానీ చాలా మంది సపోర్ట్‌తో ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. వీర శంకర్ గారికి మా కష్టాల్ని చెప్పాం. ఆయనే ముందుండి మమ్మల్ని నడిపించారు. మా నాన్న గారిని చివరి అస్త్రంగా వాడాను. ఆయన రాకతో నా కష్టాలు తీరాయి. ప్రసన్న గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. దేవ్ గారు మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాంబాబు గారు నాకెంతో సపోర్ట్ చేశారు. తక్కువ టైంలో ఈశ్వర్ మాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అర్జున్ వల్లే ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకు రాగలిగాను. జెన్నిఫర్ చక్కగా నటించారు. కోటేశ్వరరావు గారు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అన్ని కష్టాల్ని దాటుకుని మా సినిమాని ఏప్రిల్ 24న తీసుకు రాబోతోన్నాం. మా కోసం వచ్చిన భీమనేని శ్రీనివాసరావు గారు, వీర శంకర్ గారు, సముద్ర గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ మా సినిమాని చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!