Site icon NTV Telugu

షారుఖ్ ఖాన్ కోసం రెహమాన్, అనిరుధ్

AR Rahman and Anirudh team up For Shah Rukh Khan

ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.

Read Also : తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?

ఇక రెహమాన్ షారూఖ్ నటించిన ‘దిల్ సే, జబ్ తక్ హై జాన్’ సినిమాలకు మ్యూజిక్ అందిచాడు. ‘జవాన్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇర షారూఖ్ డ్యూయెల్ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం. అంతే కాదు విజయ్, రానా కూడా నటిస్తారని వినికిడి. ప్రస్తుతం షారూఖ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం ‘పఠాన్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version