తగ్గేదే లే బేబమ్మ… పాన్ ఇండియా మూవీ ఆఫర్ ?

ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న చిన్నది కృతి శెట్టి. “ఉప్పెన”లా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మొదటి సినిమాతోనే బేబమ్మగా చెరిగిపోని ముద్ర వేసింది. ఇలా మెరిసి అలా వెళ్ళిపోయే తారల్లా కాకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఒక్క సినిమాలోనే కన్పించిన ఈ బ్యూటీని పాన్ ఇండియా ఆఫర్ పలరించిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని కలలు కంటున్న ఈ బ్యూటీని ఏకంగా పాన్ ఇండియా రూపంలో అదృష్టం తలుపు తట్టిందట.

Read Also : ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో పుకార్లు నమ్మొద్దంటున్న పెన్ స్టూడియోస్!

టాలీవుడ్‌లో కృతి శెట్టి పాపులారిటీ, డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ ఆఫర్స్ తో తన షెడ్యూల్ ను నింపేసింది. తాజాగా అల్లు అర్జున్ తదుపరి చిత్రం “ఐకాన్” కోసం కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కు సంతకం కూడా చేసేసిందని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది అని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో కృతి సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందట. ప్రస్తుతం కృతి ఖాతాలో నాని “శ్యామ్ సింగ రాయ్”, రామ్ “రాపో 19”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమాలతో పాటు నితిన్ తో ఓ మూవీ కూడా చేయనుంది.

వేణు శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ “ఐకాన్”కు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ “పుష్ప”ను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అక్టోబర్‌లో సెట్స్‌ పైకి వెళ్తుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అల్లు అర్జున్ కోసం తాను, వేణు ఎదురు చూస్తున్నామని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తే అల్లు అర్జున్ తో ఆమె జత కట్టడం మూడవసారి అవుతుంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి “డిజే”, “అల వైకుంఠపురంలో” చిత్రాలలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. మరి వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతుందేమో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-