AP Govt To Take Action On Nandyal SP Raghuveer Reddy: సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు కావడంతో అతని కోసమే హైదరాబాద్ నుంచి వచ్చానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డి మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. తాజాగా ఈ అంశంలో నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అల్లు అర్జున్ జిల్లాకు వస్తున్నారు అనే సమాచారం తెలిసి కూడా ఎస్పీ స్పందించలేదని, ర్యాలీ నిర్వహించినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా చోద్యం చూస్తూ ఊరుకున్నారని రఘువీర్ రెడ్డి మీద ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?
పోలింగ్ కు 48 గంటల ముందు 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ వాటిని నంద్యాల పోలీసులు ఎస్పీ విస్మరించినట్లుగా వచ్చిన ఆరోపణలను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ధారించినట్లయింది. నంద్యాల పోలీసుల వైఫల్యం మీద కర్నూలు రేంజ్ డీఐజీ ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర డిజిపి తీసుకోబోతున్న చర్యల వివరాలను ఈసీకి జవహర్ రెడ్డి పంపించారు. తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాల వస్తున్నారని విషయం తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముందు రోజు నుంచి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని విషయం వాట్సాప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడాన్ని పోలీసులు తప్పిదంగా పేర్కొన్నారు. అక్కడ వేలాదిమంది గుమిగూడిన వారిని అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు ఏమాత్రం చేయలేదని జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నంద్యాల పోలీసులు విఫలమవడం నిజమేనని రెండు పార్టీలకు చెందిన వారు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమికూడిన విషయాన్ని సైతం రఘువీర్ రెడ్డి తెలియజేయలేదని నివేదికలో ప్రస్తావించారు.