Anweshippin Kandethum to Stream in Netflix : ఈ మధ్యన తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా ఓటీటీలో వస్తున్నాయని తెలిసిన వెంటనే సబ్ టైటిల్స్ తో చాలా ఆసక్తితో చూస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండెతుమ్‌తో మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డార్విన్ కురియకోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి రివ్యూస్ అందుకోవడమే కాదు మాంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక రిలీజ్ అయి దగ్గర దగ్గర నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో Anweshippin Kandethum సినిమా OTT ప్రీమియర్ డేట్ బయటకొచ్చింది.
Chaari 111 Review: వెన్నెల కిశోర్ ‘చారి 111’ రివ్యూ
ఈ సినిమా మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం మలయాళంలో కాకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమ్ కానుందని, మార్చి 8 నుండి అందుబాటులో ఉంటుందని అంటున్నార. కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులు మార్చి 8 నుండి ఈ చిత్రాన్ని చూసి ఆనందించవచ్చు. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యొక్క రెండు భాగాలలో హీరో రెండు వేర్వేరు కేసులను సాల్వ్ చేస్తాడు. నిజానికి సినిమా అంటే ఒకటే కేసు చుట్టూ తిప్పుతారు. కానీ ఈ సినిమాలో మాత్రం రెండు కేసులు సాల్వ్ చేస్తాడు హీరో, అదే ఈ సినిమాకి స్పెషల్ ఫీచర్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో వినీత్ తటిల్ డేవిడ్, రాహుల్ రాజగోపాల్, సిద్దిక్, షమ్మీ తిలకన్, సాదిక్, అర్థనా బిను కీలక పాత్రలు పోషించారు.