Site icon NTV Telugu

Ghaati : ఘాటీ సెన్సార్ రిపోర్టు.. అనుష్క నట విశ్వరూపమే..

Ghaati

Ghaati

Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటీ సినిమాతో రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచేసింది. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మూవీ టీమ్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూవీలో అనుష్క నటనకు వాళ్లు ఫిదా అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మంచి ప్రయత్నం అన్నారంట. ఇందులో యాక్షన్, ఎమోషన్ కలగలిపి సినిమాకు మంచి వెయిట్ తీసుకొచ్చాయని అంటున్నారు. ఈ సినిమాలో అనుష్క చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు.

Read Also : Allu Arjun : చిరంజీవి మాటలకు ఏడ్చేసిన బన్నీ

చాలా వరకు అనుష్క రియాల్టీలోనే స్టంట్లు చేసిందంట. సీన్లు అత్యంత రియాల్టీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులోని ఫస్ట్ హాఫ్‌ చాలా థ్రిల్లింగా అనిపిస్తుందంట. ఉత్కంఠభరితమైన యాక్షన్ సీన్లు, రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో ఫైట్స్ బోర్ కొట్టించకుండా సాగిపోతాయంట. అలాగే ఇంటర్వెల్ సీన్సు మెప్పిస్తాయని అంటున్నారు. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్లతో పాటు క్లైమాక్స్ మంచి వెయిట్ ఉంటుందని చెబుతున్నారు. ఇందులో అనుష్క పాత్ర శీలావతిలో చాలా షేడ్స్ ఉంటాయంటున్నారు. ఎమోషనల్, యాక్షన్ సీన్లలో చాలా షేడ్స్ కనిపిస్తాయంట. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయి. మరి ఈ సెన్సార్ రిపోర్టు ఏ స్థాయి వరకు నిజం అనేది రిలీజ్ రోజు తేలిపోనుంది.

Read Also : Chiranjeevi – Allu Arjun : పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్

Exit mobile version