Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెరుపు తీగైనా కాసేపు అలా కనిపిస్తోందేమో కానీ అనుష్క శెట్టిని ఆఫ్ స్క్రీన్ చూడాలంటే కళ్లు కాయలు కాయాల్సిందే. అనుష్క సినిమాలు చేస్తోంది కానీ ప్రమోషన్స్‌కు రాదు.. హీరోలే ఆ బాధ్యతలు తీసుకోవాలి. మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి నుండి ఇదే తంతు. ఘాటీ కోసం రానా, బన్నీలతో ఆడియో ఇంటర్వ్యూలిచ్చి సరిపెట్టేసింది. మీడియా కంటికి కనిపించదు. పోనీ సోషల్ మీడియాతోనైనా ఫ్యాన్స్ టచ్‌లో ఉంటుందా అంటే నెట్టింట్లో అసలు యాక్టివ్గానే ఉండదు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప.. మరో సమాచారం పంచుకోదు .
అనుష్కను ఎట్టకేలకు ఫ్యాన్స్ ముందుకు తెచ్చింది డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న నేపథ్యంలో టీం మొత్తం తమ ఎక్స్ పీరియన్స్ పంచుకుంది. స్వీటీ కూడా తన అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రభాస్, రానాతో కలిసి షూటింగ్ టైంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంది. ఈ డాక్యుమెంటరీలో అనుష్కతో పాటు ప్రభాస్‌ను చాలా రోజుల తర్వాత పక్క పక్కనే చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కోసం ఆఫ్ స్క్రీన్‌లో అనుష్క తళుక్కున మెరిసింది కానీ ఇది గతంలో రికార్డ్ చేసిన వీడియో. అందులోను అనుష్క ఫేస్ స్వాప్ చేసారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ కథనార్తో మలయాళ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్క ఇక బయట కనిపించడం అనేది జరగదని చెప్తున్నారు. అందుకు ఇష్టపడట్లేదట స్వీటీ. తెలుగులోను ఇక సినిమాలు చేసే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.
Also Read
- Joseph Vijay : 'మెగా 158' నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
- Anirudh : అనిరుథ్ - కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!