Anushka: అందాల తార అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో మొదలైన స్వీటీ జర్నీ.. నిశ్శబ్దం వరకు ఏకధాటిగా కొనసాగుతూనే వచ్చింది. ఈ సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అందుకు కారణం.. ఆమె బరువు పెరగడం. జీరో సీజ్ సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. మళ్లీ నార్మల్ కాలేకపోయింది. నిశ్శబ్దం లో కూడా ఆమె కొద్దిగా బొద్దుగానే కనిపించింది. మధ్యలో ఆమె బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంది.. బరువు తగ్గింది.. కానీ, అది కొన్నిరోజులకే పరిమితమయ్యింది. మళ్లీ అనుష్క బరువు పెరగడం మొదలయ్యింది. ఇక దీంతో ఆమె సినిమాలు తగ్గించడమే కాకుండా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. ఇక దాదాపు మూడేళ్ళ తరువాత ఆమె మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
ట్రైలర్ అంతా బావుంది కానీ, అనుష్క ముఖం మారిపోయింది. అంటే.. ఆమెను సన్నగా చూపించడానికి మేకర్స్ కష్టపడినట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ లో స్వీటీ ముఖాన్ని సన్నగా చేయడానికి ప్రయత్నించి.. కొన్ని షాట్స్ లో అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు మేకర్స్. ముఖ్యంగా స్వీటీ ముఖం కొన్ని షాట్స్ లో బొద్దుగా.. మరికొన్ని షాట్స్ లో సన్నగా కనిపించడంతో ఫ్యాన్స్.. ఏందయ్యా ఇది.. అనుష్క ముఖాన్ని ఇలా మార్చేశారు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. స్వీటీ బొద్దుగా ఉన్నా బాగానే ఉంటుంది.. ఇలా విఎఫ్ఎక్స్ లు అవేం అవసరం లేదని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ తేడాలను స్క్రీన్ షాట్స్ తీసి నెటిజన్స్ స్వీటీని ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో స్వీటీ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.