Site icon NTV Telugu

స్కామ్‌స్టర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తా… డైరెక్టర్ వార్నింగ్

Anurag-Kashyap

సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఏది నిజమో ? ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. సినిమాల విషయంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే సమయానికి ఆ ఫేక్ న్యూస్ మేకర్స్ దృష్టిని వచ్చిందంటే సరే.. లేదంటే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు మోసపోక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Read Also : రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !?

చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్కామ్‌స్టర్ అంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో సేక్రేడ్ గేమ్స్ తదుపరి సీజన్ కు సంబంధించిన ఫేక్ కాస్టింగ్ కాల్ గురించి ఉంది. ఈ పోస్ట్‌ను పంచుకుంటూ అనురాగ్ ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి తన ఖాతాను వెంటనే డిలీట్ చేశాడు. అనురాగ్ ఈ పోస్ట్‌ లో “ఈ వ్యక్తి రాజ్‌బీర్ కాస్టింగ్ ఒక మోసగాడు. దయచేసి ఇతనిపై రిపోర్ట్ చేయండి. ‘సేక్రెడ్ గేమ్స్’లో మూడవ భాగం లేదు. నేను ఈ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. ఈ స్కామ్ గురించి జాగ్రత్త వహించండి” అంటూ రాసుకొచ్చారు.

అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వాని, నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “సేక్రేడ్ గేమ్స్”. దీన్ని ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అనురాగ్, విక్రమాదిత్య కలిసి ఈ సిరీస్ ను నిర్మించారు. ఇక ఈ పాపులర్ సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, గిరీష్ కులకర్ణి, నీరజ్ కబీ, జీతేంద్ర జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ‘సేక్రెడ్ గేమ్స్’ మొదటి సీజన్ 8 ఎపిసోడ్‌లతో జూలై 2018లో వచ్చింది. దీని రెండవ సీజన్ ఆగస్ట్ 2019లో వచ్చింది. మూడవ సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version