Anupama : అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉన్నా సరే సినిమాలతో చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆమె రీసెంట్ గా నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇన్ని రోజులు ఆమె పెద్దగా మాట్లాడలేదు. తాజాగా ఆమె రియాక్ట్ అయింది. ఈ సినిమా ఫలితం తనను ఎంతో బాధ పెట్టిందని చెప్పుకొచ్చింది ఈ భామ.
Read Also : Renu Desai : నా మీద కాదు.. వాటిపై ఫోకస్ చేయండి.. రేణూ దేశాయ్ ఫైర్
మనం చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటాం. కానీ అన్ని వేళలా అది నిజం కాదు. కొన్ని సార్లు ప్రేక్షకులకు మన సినిమాలు నచ్చకపోవచ్చు. కానీ ప్రతి సినిమాలో నేను విభిన్న పాత్రలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. బైసన్, కిష్కిందపురి సినిమాల్లో నేను చేసిన పాత్రలు ఒక్కటి కాదు. త్వరలో మరిన్ని విభిన్న రకాల పాత్రలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది అనుపమ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Ravi Teja : రవితేజ సంచలన సినిమా.. చేస్తే మామూలుగా ఉండదు
