‘రౌడీ బాయ్స్’ అనుపమను ఆదుకుంటారా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలలా ఎగసి పడింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అయితే మళ్ళీ పైకి లేవటం లేదు. ఈ ప్రతిభావంతులైన కథానాయిక కెరీర్‌లో సరైన సక్సెస్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. అనుపమను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ తెలుగులో తొలి సినిమా ‘అ ఆ’తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు ‘ప్రేమమ్’తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుంది. ఇక ‘శతమానంభవతి’తో స్టార్ గా ఎదిగింది. అయితే ఆ తర్వాత రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగి’, నానితో ‘కృష్ణార్జునయుద్ధం’, సాయిధరమ్ తో ‘తేజ్ ఐ లవ్ యు’, మళ్ళా రామ్ తో ‘హలో గురు ప్రేమకోసమే’, బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ సినిమాలు చేసింది. వీటిలో కొద్దో గొప్పో ‘రాక్షసుడు’ పర్వాలేదనిపించినా అనుపమకు ఒరిగింది ఏమీ లేదు.
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ సాఫీగా సాగాలంటే ఇప్పుడు ఆమెకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న దిల్ రాజు ‘రౌడీ బాయ్స్’పై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీంట్లో దిల్ రాజు సోదరుడి కొడుకు హీరోగా నటిస్తున్నాడు. అంతే కాదు ఇందులో కొత్త హీరోతో లిప్ లాక్స్ మాత్రమే కాదు డ్యాన్స్ నంబర్స్ కూడా చేసింది అనుపమ. సంక్రాంతి సెంటిమెంట్ కూడా యాడ్ అవుతోంది. గతంలో సంక్రాంతికి వచ్చిన దిల్ రాజు సినిమా ‘శతమానంభవతి’ ఆమె కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా. ఆ సెంటిమెంట్ మరోసారి తనను కాపాడుతుందని అనుపమ నమ్ముతోంది. ఇది కాకుండా అనుపమ నిఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ ’18 పేజీలు’, ‘కార్తికేయ 2’ సినిమాలతో పాటు మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్ లో కూడా నటిస్తోంది. మరి రాబోయే ఈ సినిమాలతో అనుపమ మునపటి ఫామ్ ను అందిపుచ్చుకుంటుందో లేదో చూద్దా
Also Read
తాజావార్తలు
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!