సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ డీజే టిల్లు సినిమా వల్లనే ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది.ఇప్పుడు డీజే టిల్లు యొక్క సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెల్సిందే. ఆ సీక్వెల్ కు సంబంధించిన విడుదల తేదీని ఇటీవలే అధికారికంగా అయితే ప్రకటించారు.ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయని డీజే టిల్లు సీక్వెల్ యూనిట్ సభ్యులు ఇప్పటికే చెబుతున్నారు.
డీజే టిల్లు యొక్క సీక్వెల్ కు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో రూపొందిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెల్సిందే.ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కాస్త డిఫికల్ట్ గా ఉంటుందని సమాచారం.అందుకే చాలా మందిని అనుకున్న తర్వాత చివరకు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసి ఉంటారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సిద్దు జొన్నలగడ్డ తో ముద్దు సన్నివేశాల్లో ఈ అమ్మడు బాగా నటించింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు అనుపమ సినిమా ల్లో కనీసం స్కిన్ షో చేసేందుకు కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ ఈ సినిమా లో ఏకంగా ముద్దు సన్నివేశానికి ఓకే చెప్పింది అంటే ఈ అమ్మడు ఎంత గా అప్డేట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత జాతర పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సీక్వెల్ లో నటిస్తున్నందు కు గాను రూ.1.25 కోట్ల ను అనుపమ పరమేశ్వరన్ డిమాండ్ చేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అధికారికం గా క్లారిటీ అయితే లేదు