Anukreethy Vas as Jayavani First Look Released:మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న బయోపిక్ ‘టైగర్ నాగేశ్వర రావు’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు కాగా వారిద్దరూ కాకుండా మరొక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు. ఆ తమిళ బ్యూటీ లుక్ ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వర రావు సినిమాలో జయవాణి పాత్రలో అనుకీర్తి వ్యాస్ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ వెల్లడిస్తూ ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. తెలుగులో అనుకీర్తికి ఇది మొదటి సినిమానే అయినా ఇంతకు ముందు విజయ్ సేతుపతి తమిళ్ సినిమా ‘డీఎస్పీ’లో నటించారు. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2018లో ఆమె ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా.
CBFC Corruption: విశాల్ ఆరోపణలకు దిగొచ్చిన కేంద్రం.. విచారణకు ఆదేశం!
అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ మీద భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ‘కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ విజయాల తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడమే. ఇక ఈ సినిమాకి వంశీ దర్శకుడు కాగా అక్టోబర్ 3న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు మేకర్స్. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.