Ishan: దశరథ్ ఆవిష్కరించిన ‘అంతం కాదిది ఆరంభం’ మోషన్ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan: నూతన దర్శకుడు ఇషాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించి.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్ చేసి… వాళ్ల నగ్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు? ఎలాంటి శిక్ష వేశారు అనేదే ఈ చిత్రం కథ. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కరెంట్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని దీనిని తీశారు. సిరాజ్ తో చాలా కాలం నుంచి పరిచయం వుంది. టైటిల్ బాగుంది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అని తెలిపారు.
నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ, “సూపర్ స్టార్ కృష్ణ గారి మీద అభిమానంతో మా సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ఎక్కడా రాజీపడకుండా మూవీని తీశాం. మహిళలపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఈ చిత్రం ఓ మేసేజ్ ఇస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా హీరో కం డైరెక్టర్ ఇషాన్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, హీరోయిన్స్ శక్తి మహీంద్రా, నిష్మా, షేర్ స్టూడియో అధినేత దేవీ ప్రసాద్, గీతా సింగ్, ఖాదర్ గౌరీ, వైష్ణవి, నాగ మధు తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
- Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
- Peddi : 'పెద్ది' ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
- Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు
తాజావార్తలు
-
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
-
Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
-
Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
-
CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
-
Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?