న్యాచురల్ స్టార్ నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని.. చిన్న గ్యాప్ దొరికినా సినిమా ప్రమోషన్ చేసేస్తున్నాడు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో నాని భార్య అంజనా కూడా ఒక చేయి వెయ్యడం విశేషం.. ఇటీవలే అంటే సుందరానికి ప్రమోషనల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ఇక ఈ సాంగ్ కు హీరోయిన్ నజ్రియా, నాని భార్య అంజనా రీల్ చేశారు. మధ్యలో నాని కూడా కలవడంతో ఈ వీడియో అద్భుతంగా ఉంది. తందానానంద అంటూ సాగే ఈ సాంగ్ హుక్ స్టెప్ ను నజ్రియా, అంజనా వేస్తూ ఉంటే మధ్యలో నాని కూడా ఎంటర్ అయ్యి రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రియల్ వైఫ్, రీల్ వైఫ్ తో నాని చిందులు బాగా వేస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.