టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది. డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు పూరి. ఈ నేపథ్యంలో సేతుపతితో సినిమా కోసం కథ చాలా పవర్ఫుల్ గా రెడీ చేశాడని టాక్ ఉంది. పూరి, విజయ్ సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Coolie : ‘చికిటు’ తెలుగు లిప్ సింక్ కోసం AI టెక్నాలజీ
విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా కోసం ఫిక్స్ చేసారు. కాగా ఈ సినిమాను పూరి కనెక్స్ట్ బ్యానర్‌పై ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇప్పడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరొక నిర్మాత వచ్చి చేరాడు. జేబీ మోషన్ పిచర్స్ అధినేత జెబి నారాయణ నిర్మాతగా పూరి సేతుపతి సినిమా కోసం పూరి కనెక్ట్స్ తో చేతులు కలిపారు. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది టీమ్. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విష్ణు రెడ్డి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నాయి.