Site icon NTV Telugu

V.S. Gnanashekar: సుజనారావ్ దర్శకత్వంలో మరో సినిమా!

Gunay

Gunay

 

ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు.

విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మించనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో తెలియనుంది. దర్శకుడు క్రిష్ తో కలిసి వి. ఎస్. జ్ఞానశేఖర్ ‘కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘మణికర్ణిక’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించి నిర్మిస్తున్న ‘ఐబి 71’ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళంలో ‘జయం’ రవితో ఒక సినిమాకు జ్ఞానశేఖర్ వర్క్ చేస్తున్నారు.

Exit mobile version