"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…