దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 26న విడుదలైంది.
Read Also : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్
ఈ రోజు (ఆగస్టు 30) సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే మూడు భాషల్లో ముగ్గురు హీరోలతో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయిస్తుండడం విశేషం. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, తమిళంలో సూర్య ఈ ట్రైలర్ ను ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకులు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌స్టార్‌లో ఆనందించవచ్చు.