Anirudh: అంచనాలు పెంచేశావ్ మావా… నీ పీక్ ఫామ్ లో చేస్తున్న దేవర ఎలా ఉంటుందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్… లేటెస్ట్ గా జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అనిరుద్ మ్యూజికల్ అనే పేరుని చూసి కూడా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే ప్రస్తుతం అనిరుద్ ఉన్న ఫామ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పీక్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న అనిరుద్… ఇలాంటి గోల్డెన్ ఫేజ్ లో చేస్తున్న ఏకైక తెలుగు సినిమా ‘దేవర’ మాత్రమే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమా తెరకెక్కుతుంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. కొరటాల శివ మార్క్ ఎలివేషన్స్ కి, ఎన్టీఆర్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అనిరుద్ మ్యూజిక్ కొడితే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దొమ్మలు అదరడం గ్యారెంటీ. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిరుద్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అనిరుద్ జైలర్ రేంజులో దేవరకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే చాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ పడినట్లే. మరి దేవర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేంజ్ చూపించడానికి శాంపిల్ గా వస్తున్న దేవర టీజర్ ని అనిరుథ్ ఏ రేంజులో వాయించాడో చూడాలి. అనిరుథ్ ఒక్కడు పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తే దేవర రేంజ్ ఊహించని విధంగా మారిపోతుంది. మరి ఈ సముద్ర వీరుడికి, మ్యూజికల్ సెన్సేషన్ ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?