Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ మూవీ గతేడాది రిలీజై భారీ విజయం అందుకుంది.ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక అతి త్వరలోనే ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ .. ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక దీంతో మేకర్స్ ఓటిటీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. వరుసగా ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఎవరెవరో ఫుల్ వీడియో ను రిలీజ్ చేశారు.
ఇక తాజాగా ప్రతి తండ్రి కొడుకును కనెక్ట్ చేసే సాంగ్.. నాన్న నువ్వు నా ప్రాణం వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ రిలీజైన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్ ను అందుకోవడం విశేషం. తండ్రి ప్రేమ కోసం ఒక కొడుకు పడే బాధను ఈ వీడియోలో చూపించారు. బిజీ వర్క్స్ తో ఉంటూ కొడుకును పట్టించుకోని తండ్రితో తనచిన్న చిన్న ఆనందాలను పొందలేకపోయానే అని కొడుకు ఎంత మనోవేదనను అనుభవించాడో అనంత్ శ్రీరామ్ లిరిక్స్ లో స్పష్టంగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి థియేటర్ లో రచ్చ రేపిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి రచ్చ రేపుతుందో చూడాలి.
