Site icon NTV Telugu

Animal: డ్యూరేషన్ ఏంటి అంత ఉంది.. బోర్ కొట్టకుండా చేస్తే తరిగిపోతుందిలే

Animal

Animal

Animal: ఈ కాలంలో థియేటర్ 2 గంటలు కూర్చోవాడానికే ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఒక్కో సినిమా దాదాపు 3 గంటలు ఉండేదట. అంతసేపు ఒక ప్రేక్షకుడును థియేటర్ లో కుర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మొత్తం బోర్ కొట్టకుండా ఉండాలి. కాస్తా అటుఇటు అయినా.. టాక్ మొత్తం రివర్స్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ కూడా అంత నిడివి ఉన్న సినిమాలను రిలీజ్ చేయడం లేదు. ఒకవేళ చేసినా ప్రేక్షకుడిని సీట్ లో కుర్చోనిచ్చేంత కథను చెప్పడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ఇలాగే జరిగింది. రవితేజ, గజదొంగ కథ.. అదిరిపోతోంది.. 3 గంటలు నిడివి అని రిలీజ్ చేసారు. ఇక ఆ సినిమాకు నిడివే నెగెటివ్ గా మారింది. ఆ నెగెటివ్ టాక్ చూసి.. సినిమాకు కత్తెరపడింది. అయినా కూడా సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా అంతకు మించిన డ్యూరేషన్ తో వస్తుంది. అదే యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

R Madhavan: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నా..

రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతి సాంగ్ లో రణబీర్ ను సందీప్ చూపించే విధానం.. సినిమాపై మరిన్ని హోప్స్ పెట్టుకొనేలా చేస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యినట్లు సందీప్ అధికారికంగా ప్రకటించాడు. “యానిమల్ కు సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికేట్ జారీ చేసారు. 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల నిడివితో 16 ఫ్రేమ్స్ రన్ టైమ్ తో యానిమల్ రిలీజ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అసలు A సర్టిఫికేట్ అంటేనే ఎలాంటి కట్స్ లేకుండా రక్తపాతం, బూతులు.. బ్లర్ కానీ, మ్యూట్ కానీ లేకుండా చూపించడం. అక్కడే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు అంత డ్యూరేషన్ అంటే మాములుగా ఉండదు. అయితే ఇక్కడ డ్యూరేషన్ ఎంత అనేదానికన్నా.. అంతసేపు ఒక ప్రేక్షకుడును కూర్చోనేలా చేయగల సత్తా సందీప్ లో ఉందా.. ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఈ విషయం విన్నాక అభిమానులు అంటున్న ఒకే ఒక్క మాట డ్యూరేషన్ ఏంటి అంత ఉంది.. బోర్ కొట్టకుండా చేస్తే తరిగిపోతుందిలే అని.. మరి సందీప్.. ఈ పరీక్షలో పాస్ అవుతాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version