NTV Telugu Site icon

Animal: మొన్న భార్య.. ఇప్పుడు నాన్న.. యానిమల్ ఎమోషన్స్ వేరే లెవెల్ అంతే

Animal

Animal

Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ మరియు పి సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ.. దానికోసం ఆగలేకపోతుందంట.. ?

ముఖ్యంగా భార్యపై ప్రేమను రణబీర్ ఏ విధంగా చూపించాడో నీ వేరే నువ్వు వేరే అనే సాంగ్లో చూపించాడు సందీప్. ఇక ఇప్పుడు తండ్రి మీద ప్రేమను మూడో సాంగ్ లో చూపించబోతున్నాడు. నాన్న నువ్వు నా ప్రాణం అంటూ సాగే ఈ సాంగ్ ను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ పోస్టర్లో రణబీర్ భుజాన చెయ్యి వేసి అనిల్ కపూర్ కనిపించాడు. ఈ సాంగ్ లో తండ్రి కొడుకుల అనుబంధాన్ని సందీప్ చూపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టర్ పై అభిమానులు మొన్న భార్య ఇప్పుడు నాన్న యానిమల్ ఎమోషన్స్ వేరే లెవెల్ అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఇంకో రికార్డును సృష్టిస్తాడేమో చూడాలి.

Show comments