గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌కు, ఆయన మేకోవర్‌కు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్‌పై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కురిపించిన ప్రశంసల జల్లు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
‘ ‘పెద్ది’ ట్రైలర్ పూర్తిగా అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ పాత్ర కోసం తన హృదయాన్ని, ఆత్మను (ప్రాణాన్ని) పెట్టేశారు. ఆయన చూపించిన ఇంటెన్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ నిజంగా శ్వాస ఆగిపోయేలా ఉంది. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వెంకట సతీష్ కిలారు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు, చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్!’ అని ప్రశంసించాడు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. కాగా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ ఎపిక్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
#PeddiTrailer is absolutely phenomenal🔥🔥🔥
Mega Power Star @AlwaysRamCharan Garu has poured his heart and soul into the role, and his intense transformation looks truly breathtaking ❤️🔥
My best wishes to @VenkataSKilaru Garu on his debut production, and all the very best to…
— Anil Ravipudi (@AnilRavipudi) May 20, 2026
