ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. పలు విభాగాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటగా, వాటిలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అవార్డు రావడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వివరించారు. “భయపడుతూ ఉండే ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారే కథను ఎంతో అద్భుతంగా, సమర్థవంతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా పవర్‌ఫుల్‌గా, కథకు తగ్గట్టుగా మిళితం అయ్యాయి” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విజయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను పంచుకుంటూ..
Also Read : Coolie : రజినీ ‘కూలీ’ ఈవెంట్.. తొలిసారి తెలుగులో ప్రసారం
“ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్ మూవీ. ఇప్పటి వరకు నేను ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్, కమర్షియల్ సినిమాలే చేశాను. కానీ భగవంత్ కేసరి మాత్రం వేరే. ఇది నాకు నేను పెట్టుకున్న ఒక పెద్ద టెస్ట్. నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి, కంటెంట్‌పై ఫోకస్ చేసిన చిత్రం ఇదే” అన్నారు.అలాగే హీరో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ..“ఇలాంటి కథను ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం. ఆయన ఓకే చేయకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఈ ప్రాజెక్ట్‌నే నేను ఒక ఛాలెంజ్‌లా తీసుకున్నాను” అని గుర్తుచేశారు. కథ, భావోద్వేగం, యాక్షన్ కలగలిపిన భగవంత్ కేసరి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ విజయం అనిల్ రావిపూడి కెరీర్‌లోనే కాకుండా, టాలీవుడ్‌కి కూడా ఒక గర్వకారణంగా నిలిచింది.
