Coolie : రజినీ ‘కూలీ’ ఈవెంట్.. తొలిసారి తెలుగులో ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దగ్గర ఒకప్పుడు సినిమాలు విడుదలకు ముందు ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే కొనసాగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కి మాత్రం ఈ సారి కొంచెం విభిన్నంగా, ఇంకా గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. “కూలీ అన్‌లీష్డ్” పేరుతో జరిగిన ఈ ఈవెంట్ యూట్యూబ్ లేదా ఇతర ఛానెల్స్‌లో లైవ్ ఇవ్వకుండా, సన్ టీవీ లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేశారు.
Also Read : Anupama : బ్రిడ్జ్‌పై నుండి కిందపడిపోయిన అనుపమ – షూటింగ్‌లో ఏం జరిగిందంటే ?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఈ ఈవెంట్‌లో మరో విశేషం ఏమిటంటే.. కూలీ ఈవెంట్ తెలుగులో కూడా ప్రసారం కానుంది. ఆగస్టు 15న రాత్రి 9:30 గంటలకు సన్ నెట్‌వర్క్‌లో భాగమైన జెమినీ టీవీపై ఇది ప్రసారం కానుంది. సాధారణంగా తమిళ సినిమాలకు తెలుగులో చిన్న ఈవెంట్లు లేదా ప్రెస్ మీట్లు చేస్తారు. కానీ చెన్నైలో జరిగిన ఒక పూర్తి స్థాయి తమిళ ఈవెంట్‌ను నేరుగా తెలుగులో ప్రసారం చేయడం చాలా అరుదు. బహుశా ఇది తొలిసారి అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ ఈవెంట్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పాడిన పాటల బదులు కూలీ తెలుగు పాటలను వినిపించనున్నారు. అలాగే..
స్పీచ్‌లకు కూడా తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇది తమిళ సినిమాలను డబ్ చేయడం దాటికి, ఈవెంట్లను కూడా అనువదిస్తున్నారా అన్న చర్చలకు దారితీసింది. ఈ నిర్ణయం ‘కూలీ’ తెలుగు ప్రమోషన్లలో టీం పెట్టుకున్న శ్రద్ధకు నిదర్శనం. అయితే, రజినీకాంత్‌ను హైదరాబాద్‌కు రప్పించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఉంటే మరింత బాగుండేదని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, కూలీ సినిమాకు ఇప్పటికే బంపర్ హైప్ వచ్చింది. రజినీ సినిమాలకు తెలుగులో క్రేజ్ మామూలే, దానికి తోడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం, నాగ్ విలన్ పాత్ర, ఉపేంద్ర ప్రత్యేక పాత్ర.. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆగస్టు 14న ఈ సినిమా వార్-2తో పాటు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..