Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?

Anil Ravipoodi Commercial Hits

Anil Ravipoodi Commercial Hits

ఒక సక్సెస్‌ఫుల్ సినిమా చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందనే వాళ్ళకి అనిల్ రావిపూడి చేసే సినిమాలు చూపించాలి. నిజానికి రాజమౌళి లాంటి భారీ విజువల్ వండర్స్ తీసే దర్శకులను పక్కన పెడితే, మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకులు సైతం ఒక సినిమాను చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల ఇండస్ట్రీలో సినిమాల కొరత ఏర్పడుతుంది. సినీ కార్మికులకు పూర్తి స్థాయిలో పని దొరకడం లేదు. కానీ అనిల్ రావిపూడి మాత్రం వీలైనంత తొందరగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. నిజానికి కమర్షియల్ సినిమాలతో వరుస సక్సెస్‌లను సాధించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక సంవత్సరానికి దాదాపు 100కి పైన కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. వాటన్నింటినీ కాదని మన స్టోరీలో ఏదో కొత్తదనం ఉన్నప్పుడే ప్రేక్షకులు మన కథను ఆదరిస్తారు, సినిమాను చూడటానికి ఇష్టపడతారు. కొన్ని సంవత్సరాలుగా అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాతో ప్రతి ఏడాది సంక్రాంతికి వచ్చి సక్సెస్‌లను సాధిస్తున్నాడు. హిట్ కొట్టడం మిగతా వాళ్ళ వల్ల ఎందుకు సాధ్యమవ్వడం లేదు, అనిల్‌కి మాత్రమే సక్సెస్‌లు ఎందుకు దక్కుతున్నాయి అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి…

అనిల్ సినిమాల్లో ఏం ఉంటుంది? మిగతా వాళ్ల మూవీస్‌లో ఏం మిస్ అవుతుంది?
నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సినిమాను చూడటానికి వచ్చే చాలా మంది ప్రేక్షకులు వాళ్ళకి ఉన్న బాధను మర్చిపోవడానికి థియేటర్‌కి వస్తారు. ఆయన సినిమాల్లో ప్రేక్షకుడికి పూర్తిస్థాయి వినోదం దొరుకుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేలా సన్నివేశాలను డిజైన్ చేస్తాడు. తన సినిమాల్లో ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుంది. అందుకే ఆయన మూవీస్‌ను ప్రేక్షకులు చూస్తున్నారు, సినిమాలు సూపర్ సక్సెస్‌లను సాధిస్తున్నాయి. మిగతా దర్శకుల విషయానికి వస్తే వాళ్ళు కమర్షియల్ సినిమాల పేరు చెప్పి రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్‌లో సినిమాలు చేస్తున్నారు. ప్రతి సీన్ ఇంతకు ముందు మనం ఏదో ఒక సినిమాలో చూసిందే ఉండటం వల్ల ప్రేక్షకులను ఈ సినిమాలు పూర్తి స్థాయిలో అలరించడం లేదు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు సైతం అనిల్ రావిపూడికి తెలిసిన కమర్షియల్ మూవీ స్టైల్, ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ మరే దర్శకుడికి తెలియడం లేదు అంటున్నారు. అందుకే అనిల్ వరుస సక్సెస్‌లను సాధిస్తుంటే, మిగతా దర్శకులు మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు.

‘జనవరి 12 విడుదల’ మూవీ కూడా హిట్టేనా?
వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లను హీరోలుగా పెట్టి చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ మూవీ 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశాడు. మొదటి సారి మల్టీస్టారర్ మూవీ చేస్తున్న అనిల్ రావిపూడి ఇద్దరి ఇమేజ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది తెలుసుకోవడానికి ఆయన అభిమానులతో పాటు హీరోల ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ మూవీతో సక్సెస్ కొడితే వరుసగా 10 విజయాలు సాధించిన దర్శకుడిగా పేరు సంపాదించుకుంటాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్‌లో రాజమౌళి తర్వాత వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకుడిగా పేరు సంపాదించుకుంటాడు.