టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరువాత కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు అనిల్ రావిపూడి. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వరుస విజయాలను అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ లో మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో తీసి మెప్పించిన అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. ” పటాస్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రోజూ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ ఆఫీస్ కి వచ్చేవారు. సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ రావడం.. నాతో జోకులు వేయడం యథాతథంగా జరిగేవి. రోజూ ర్యాగింగ్ చేసేవాడు. దారుణమైన జోక్స్ వేసేవాడు నాపై.. నేను వాటిని చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. అంత పెద్ద హీరో అయినా ఎప్పుడు అలా ఉండేవాడు కాదు.
నన్ను ప్రతి చిన్న విషయంలో కూడా సరదాగా అల్లరి చేయడం.. నాపై చిన్న విషయంలో కూడా జోకులు వేయడం చేసేవాడు. ఆరోజులు నేనెప్పటికీ మర్చిపోలేను. పటాస్ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాను.. కానీ, కుదరలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ అందరితోనూ సన్నిహితంగా ఉంటాడన్న విషయం తెల్సిందే. ఆయన సింప్లిసిటీ కి ఇది ఒక నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత బాలయ్యతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
