Andrea Jeremiah: ‘నో ఎంట్రీ’ అంటున్న కోలీవుడ్ కుర్రది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andrea Jeremiah: కోలీవుడ్‌లోని మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒకరు. సింగర్ గానే కాకుండా నటిగా కూడా ఆండ్రియా చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో ఆమె నటించింది. అయితే ఈ సారి ఆండ్రియా యాక్షన్ హీరోయిన్గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘నో ఎంట్రీ’ చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘నో ఎంట్రీ’ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్‌ని గమనిస్తే… దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల బారి నుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఎంతో థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు ఆర్. అళగు కార్తీక్ వెల్లడించారు. జంబో సినిమాస్ బ్యానరులో శ్రీధర్ అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మించారు. అదవ్ కణ్ణదాసన్, రన్యా రావ్, మానస్, జయశ్రీ, జాన్వీ ఇతర కీలకపాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలకానుంది.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!